జోగి రమేశ్‌కు సిట్ బిగ్ షాక్.. బెయిల్ రద్దు చేయాలని పిటిషన్

by Vemula.Srinu Prasad |

మాజీ మంత్రి జోగి రమేశ్‌కు బిగ్ షాక్ తగిలింది. ...

జోగి రమేశ్‌కు సిట్ బిగ్ షాక్.. బెయిల్ రద్దు చేయాలని పిటిషన్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి జోగి రమేశ్‌(Former Minister Jogi Ramesh)కు బిగ్ షాక్ తగిలింది. నకిలీ మద్యం కేసు(Fake Liquor Case)లో బెయిల్ రద్దు చేయాలని విజయవాడ ఎక్సైజ్ కోర్టు(Vijayawada Exise Court)లో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని సిట్(SIT) అనుమానం వ్యక్తం చేసింది. సాక్షులనుకూడా బెదిరించే అవకాశముందని పిటిషన్ లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై రేపు విచారణకు వచ్చే అవకాశం ఉందని సిట్ అధికార వర్గం అంటోంది.

రిమాండ్ ఖైదీగా 83 రోజుల పాటు జైల్లోనే..

కాగా విజయవాడ ఇబ్రహీంపట్నం, అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు విజయవాడ జైలులో 83 రోజుల పాటు రిమాండ్ ఖైదీలుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే బెయిల్ మంజూరు కావడంతో ఇటీవలే జైలు నుంచి విడుదల అయ్యారు. ఇంతలోనే సీఎం చంద్రబాబు, లోకేశ్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో విజయవాడలో టీడీపీ నేతలు భగ్గుమన్నారు. జోగి రమేశ్ ఇంటిపై దాడి చేశారు. పెట్రోల్ బాంబులు విసిరి నిప్పంటించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 40 మంది టీడీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు మాజీ మంత్రి జోగి రమేశ్ పైనా మూడు ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో జోగి రమేశ్ బెయిల్ రద్దు చేయాలని సిట్ పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.

Next Story