- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెంకటేశ్వరస్వామి కిరీటం తాకట్టుపై అధికారుల సీరియస్.. ఆలయ కమిటీకి నోటీసులు
గుడివాడ కల్యాణ వెంకటేశ్వరస్వామి కిరిటాన్నిఆలయ కమిటీ తాకట్టు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై దేవాదాయ అధికారులు సీరియస్ అయ్యారు..

దిశ, వెబ్ డెస్క్: గుడివాడ కల్యాణ వెంకటేశ్వరస్వామి కిరిటాన్ని(Gudivada Kalyana Venkateswara Swamy Crown) ఆలయ కమిటీ తాకట్టు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై దేవాదాయ అధికారులు(Endowments Department officials) సీరియస్ అయ్యారు. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ లలితా(Endowments Assistant Commissioner Lalitha) విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించారు. దీంతో ఆలయ ఆస్తులను సరెండర్ చేయాలని తాజాగా ఆర్యవైశ్య కల్యాణ మండపం ఆలయ కమిటీకి అధికారులు నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 43 ప్రకారం ఆస్తులు వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే అధికారుల నోటీసులను ఆలయ కమిటీ తీసుకోలేదని తెలుస్తోంది. ఎందుకంటే ఆలయ కమిటీ కింద కల్యాణ మండపం, దుఖాణాలు కూడా ఉన్నాయి. ప్రతి నెలా అద్దెల రూపంలో కమిటీకి భారీగా ఆదాయం వస్తోంది. దీంతో తమ ఆస్తులు దేవాదాయ శాఖకు వెళ్లకుండా చూడాలని కమిటీ నానా ప్రయత్నం చేస్తోందని సమాచారం.






