NTTPS Loco Shed: రైలు ఇంజిన్‌లో డీజిల్ లీక్.. చెలరేగిన మంటలు

by Vemula.Srinu Prasad |

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎన్‌టీటీపీఎస్ లోకో షెడ్‌లో అగ్నిప్రమాదం జరిగింది..

NTTPS Loco Shed: రైలు ఇంజిన్‌లో డీజిల్ లీక్.. చెలరేగిన మంటలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎన్‌టీటీపీఎస్ లోకో షెడ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రైలు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లోని కంప్రెసర్ వద్ద డీజిల్ లీక్ కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Next Story