సహాయక చర్యల్లో ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు

by Thanuru Gopichand |   (  Updated:2025-10-29 09:35:58  IST  )

ఎన్టీఆర్ జిల్లాలోని మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

సహాయక చర్యల్లో ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ జిల్లాలోని మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తగు చర్యలను తీసుకుంటున్నారు. తుఫాన్ ప్రభావంతో విజయవాడ సిటీ వన్ టౌన్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలోని బ్రిడ్జ్ ప్రాంతంలో ఈదురు గాలుల వల్ల చెట్ల కొమ్మలు నేలకొరిగాయి. ఒక చెట్లు కొమ్మ రోడ్డుపై పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే వన్ టౌన్ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ స్పందించారు. తన సిబ్బందితో కలిసి చెట్టు కొమ్మ పడిన ప్రాంతానికి హుటాహుటినా వెళ్ళారు. తన సిబ్బందితో కలిసి చెట్టు కొమ్మను తొలగించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ మాట్లాడుతూ ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నామన్నారు. నేలకొరిగిన చెట్లు, చెట్ల కొమ్మలను వీలైనంత త్వరగా తొలగిస్తున్నామని చెప్పారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. వాహనదారులు అవసరమైతే తప్ప హైవే రూట్లో ప్రయాణించొద్దని సూచించారు. ట్రాఫిక్ పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

READ MORE .....

ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు : విజయవాడ పోలీస్

Next Story