- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోమనాధ ఆలయంపై దాడి.. పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు
ఈ దేశంలో సోమనాధ ఆలయంపై మొదట దాడి జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గుర్తు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: ఈ దేశంలో సోమనాధ ఆలయం(Somnath Temple)పై మొదట దాడి జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్(BJP state president PVN Madhav) గుర్తు చేశారు. విజయవాడ సత్యన్నారాయణపురం కాశీ విశ్వేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ సోమనాధ ఆలయంపై జరిగిన దాడి ఈ దేశం, సనాతన ధర్మంపైనా జరిగిన ఘటన అని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా అన్ని శివాలయాల్లో ఓంకార్ నాదం పలకడం జరుగుతుందని తెలిపారు.
యావత్ ప్రపంచం మొత్తం..
‘‘యావత్ ప్రపంచం మొత్తం శివయ్య కాపాడుతూ వస్తున్నారు. దుష్ట ఆలోచనతో సోమనాధ్ ఆలయంపై మహమ్మద్ ఘోరి, గజినీ యాత్ర జరిగింది. ఈ ఘటన జరిగి 1000 సంవత్సరాలు పూర్తి అయ్యింది. శివ లింగాన్ని ముక్క ముక్కలు చేసిన వారికీ ఘోర పరాజయం ఎదురయ్యింది. ఘాజినీ మహ్మద్ 10 సార్లు దేవాలయాన్ని విరగగొట్టి పూజారిని చంపారు. సోమనాధ్ వైభవం దేశం వైభవంతో సమానం. అలాంటి వాటిపై చేసిన దాడిని ఇప్పటికి మర్చిపోలేని పరిస్థితి. 1947లో స్వాతంత్రం వచ్చిన అనంతరం ధ్వంసం అయిన సోమనాధ్ ఆలయం పునః నిర్మాణం చేపట్టాలని పటేల్ గుర్తుచేశారు. కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఆలయం పునః నిర్మాణాంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. భవ్యమైన సోమనాధ్ ఆలయాన్ని 1951 లో పునః నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నరేంద్ర మోదీ సోమనాధ స్వాభిమన పర్వ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.’’ అని పీవీఎన్ మాధవ్ తెలిపారు.






