గోమాతను కాపాడిన ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు

by Thanuru Gopichand |

గోవుకు (Gomatha) మెజారిటీ వర్గంలో పూజ్యనీయ స్థానం ఉంది. అంతేకాకుండా వ్యవసాయంలో కూడా గోవు స్థానం గొప్పది.

గోమాతను కాపాడిన ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : గోవుకు (Gomatha) మెజారిటీ వర్గంలో పూజ్యనీయ స్థానం ఉంది. అంతేకాకుండా వ్యవసాయంలో కూడా గోవు స్థానం గొప్పది. అటువంటి గోవును సంరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైన ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వర్తించి మానవత్వంతో పాటు తమ కర్తవ్యాన్ని చాటుకున్నారు ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు. వివరాల్లోకి వెళ్తే విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డు వద్ద డ్రైనేజీ నాలాలో ఓ గోమాత పడపోయింది. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు (NTR District Traffic Police) వెంటనే అక్కడకు చేరుకున్నారు. తోటి సిబ్బంది సాయంతో అటుగా వెళ్తున్న పలువురిని కూడగట్టుకున్నారు. వారి సహకారంతో శ్రమనోర్చి గోమాతను సురక్షితంగా బయటకు తీశారు. నాలాలో నుంచి బయటపడిన గోమాత అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయింది. దీంతో పోలీసులతో పాటు సహాయానికి వచ్చిన వారు సంతోషించారు. విధి కంటే మానవతే గొప్పదని, మానవతను కాపాడటమే నిజమైన సేవని ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు ఈ ఘటన ద్వారా మరోసారి నిరూపించారు. ట్రాఫిక్ సిబ్బంది చొరవ, మానవత్వ ధోరణిని ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు, సీఐఔ కిశోర్ బాబు అభినందించారు.

Next Story