- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలోని గొల్లపూడి గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు
ఏపీలోని విజయవాడ రూరల్ ( Vijayawada) మండలం గొల్లపూడి గ్రామ పంచాయతీకి ( Gollapudi Gram Panchayat) అరుదైన గౌరవం

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని విజయవాడ రూరల్ ( Vijayawada) మండలం గొల్లపూడి గ్రామ పంచాయతీకి ( Gollapudi Gram Panchayat) అరుదైన గౌరవం దక్కింది. ఏపీలోని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు దక్కింది. ఆత్మనిర్బర్ పంచాయతీ ( Self-reliant Panchayat) ప్రత్యేక అవార్డుల కేటగిరిలో గొల్లపూడి గ్రామ పంచాయతీ ఎంపిక అయింది.
సొంత వనరులతో గ్రామాన్ని అభివృద్ధి చేసినందుకు అవార్డు దక్కింది. ఈ తరుణంలోనే జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం రోజు ప్రధాని మోడీ ( PM Modi) చేతుల మీదుగా అవార్డు అందజేయనున్నారు. ఈనెల 24వ తేదీన పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా బీహార్ రాష్ట్రంలోని మధుబనీలో... వేడుకలలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. ఈ సందర్భంగా అవార్డుల ప్రధానం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.
ఈ సందర్భంగా గొల్లపూడి గ్రామపంచాయతీ కి కూడా అవార్డు ఇస్తారు. ఇక ఏపీలోని గొల్లపూడి గ్రామపంచాయతీకి జాతీయ అవార్డు రావడం పట్ల... చంద్రబాబు నాయుడు సర్కార్ హర్షం వ్యక్తం చేస్తోంది. గొల్లపూడి గ్రామపంచాయతీని... స్ఫూర్తిగా తీసుకొని అన్ని గ్రామాలు ఇలాగే ముందుకు వెళ్లాలని.. అధికారులు స్పష్టం చేస్తున్నారు.






