- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాళ్ల జోలికి వస్తే ఖబర్దార్: ఎంపీ కేశినేని చిన్ని స్ట్రాంట్ వార్నింగ్
వైసీపీ నేతలకు ఎంపీ కేశినేని చిన్ని స్ట్రాంట్ వార్నింగ్ ఇచ్చారు..

దిశ, వెబ్ డెస్క్: ఎన్నారైల జోలికి వస్తే ఖబర్దార్ అని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని(MP Keshineni Chinni) అన్నారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై దుష్ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ దృష్టి మళ్లించేందుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(YSRCP chief Jagan Mohan Reddy) కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.కుట్రల్లో భాగంగానే విదేశీ కంపెనీలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న ఎన్నారైలపై జగన్ విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు ఎన్నారైలు ఉత్సాహం చూపుతున్నారని, 9 నెలల్లో రూ. 7 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. జగన్ హయాంలో 21 సూట్ కేసు కంపెనీలు వచ్చాయని ఎద్దేవా చేశారు. 21వ సెంచరీ రియాల్టీస్‌లో భాగస్వాములు.. ఎవరో కేశినేని ట్రావెల్స్ ట్రావెల్స్ భాగస్వాములెవరో అందరికీ తెలిసన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటుంటూ చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న ఎన్నారైల పై వైసీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదని కేశినేని చిన్ని సూచించారు. ఎన్నారైలకు తాము అండగా ఉంటామని, రాష్ట్రంలో నిర్భయంగా పెట్టుబడులు పెట్టొచ్చని కేశినేని చిన్ని భరోసా ఇచ్చారు.






