నా భార్యకు ఈడీ నోటీసులు అవాస్తవం: ఎంపీ కేశినేని చిన్ని క్లారిటీ

by Vemula.Srinu Prasad |

ఇశాన్వీ, కేశినేని డెవలపర్స్ సంస్థలకు ఈడీ నోటీసులు వచ్చినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) స్పష్టం చేశారు. ఈ నోటీసులపై మే 27న పూర్తి వివరణ ఇస్తామని ఆయన ప్రకటించారు..

నా భార్యకు ఈడీ నోటీసులు అవాస్తవం: ఎంపీ కేశినేని చిన్ని క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: ఇశాన్వీ, కేశినేని డెవలపర్స్ సంస్థలకు ఈడీ నోటీసులు వచ్చినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) స్పష్టం చేశారు. ఈ నోటీసులపై మే 27న పూర్తి వివరణ ఇస్తామని ఆయన ప్రకటించారు. వ్యాపార లావాదేవీకి సంబంధించిన వివరణ కోరుతూనే ఈడీ ఈ నోటీసులు పంపిందని శివనాథ్ వెల్లడించారు.

రూ.35 లక్షల లావాదేవీ.. 2022లోనే దూరం!

కాగా రాజ్ కేసీరెడ్డికి చెందిన ఇశాన్వీ సంస్థతో కలిసి తాము 'ప్రైడ్ ఇన్‌ఫ్రా'ను ఏర్పాటు చేశామని ఎంపీ తెలిపారు. ఆ సంస్థ ద్వారా కేవలం రూ.35 లక్షల లావాదేవీలు మాత్రమే జరిగాయని ఆయ చెప్పారు. అయితే రాజ్ కేసీరెడ్డి నేపథ్యం, ఆయన సంగతి తెలిసిన వెంటనే 2022లోనే తాము ఆ సంస్థ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసినట్లు శివనాథ్ వివరించారు.

ఆర్కిటెక్ట్ ఫీజు మాత్రమే.. అంతకు మించి లేదు!

తాము జరిపిన ఆ లావాదేవీ కేవలం 'ఆర్కిటెక్ట్ ఫీజు' మాత్రమేనని ఎంపీ స్పష్టం చేశారు. అంతకు మించి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదనే విషయాన్ని తాము ఈడీకి ఇచ్చే వివరణలో స్పష్టంగా చెబుతామని ఆయన పేర్కొన్నారు.

భార్యకు నోటీసులు అవాస్తవం.. సంస్థకే ఇచ్చారు!

మద్యం స్కామ్‌లో తన భార్యకు ఈడీ నోటీసులు ఇచ్చిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని శివనాథ్ తీవ్రంగా ఖండించారు. గతంలో పెట్టిన ఆ కంపెనీలో తన భార్య కేవలం ఒక డైరెక్టర్‌గా మాత్రమే ఉన్నారని గుర్తుచేశారు. ఈడీ నోటీసులు పంపింది కేవలం సదరు కంపెనీకి మాత్రమేనని, తన భార్యకు వ్యక్తిగతంగా ఎలాంటి నోటీసులు రాలేదని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) స్పష్టం చేశారు.

Next Story