జగన్ కనుసన్నల్లోనే దస్తగిరి హత్య: మంత్రి రాంప్రసాద్ సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |

వైఎస్ జగన్ కనుసన్నల్లోనే దస్తగిరి హత్య జరిగిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు దస్తగిరి హత్య సమయంలో జగన్ కడప జిల్లాలోనే ఉన్నారని ఆరోపించారు....

జగన్ కనుసన్నల్లోనే దస్తగిరి హత్య: మంత్రి రాంప్రసాద్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa District) పులివెందుల(Pulivendula)కు చెందిన వైసీపీ నేత పెద్దదస్తగరి(Pedda Dastagiri) హత్యపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ కేసులో ఆ పార్టీకి చెందిన వ్యక్తి పేరు వెలుగులోకి రావడంతో వైసీపీ(Ycp) నేతలపై విమర్శల వర్షం కురుస్తోంది. ప్రధానం తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదే తరహాలోనే వైఎస్ వివేకానందారెడ్డిని కూడా హత్య చేశారని ఆరోపిస్తున్నారు.

పెద్దదస్తగిరి హత్యపై కీలక వ్యాఖ్యలు

తాజాగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి(Minister Ramprasad Reddy) మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేత పెద్దదస్తగిరి హత్య ఉదంతాన్ని గుర్తుచేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్(Ys Jagan) కనుసన్నల్లోనే దస్తగిరి హత్య జరిగిందని వ్యాఖ్యానించారు. అంతేకాదు దస్తగిరి హత్య సమయంలో జగన్ కడప జిల్లాలోనే ఉన్నారని ఆరోపించారు. పెద్ద దస్తగిరిని హత్య చేసింది వైసీపీ నేతలేనని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని, నిందితులను వదిలిపెట్టేది లేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.

Next Story