- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముస్లిం సోదరులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఆర్ధిక సాయం
త్వరలోనే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ముస్లింసోదరులకు ఆర్ధిక సాయం అందించబోతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: త్వరలోనే మైనార్టీ కార్పొరేషన్(Minority Corporation) ద్వారా ముస్లింసోదరుల(Muslim Brothers)కు ఆర్ధిక సాయం(Financial Assistance) అందించబోతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) తెలిపారు. అంతేకాదు అమరావతి(Amaravati)లో హజ్ భవనం(Haj building) నిర్మాణం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులున్నా.. ఎన్ని అవాంతారాలు ఎదురైనా అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మంచికి ప్రజల సహకారం కూడా అవసరమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అల్లా కృప తోడుగా ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు.
హజ్ యాత్రను ప్రారంభించిన మంత్రి కొల్లు
గన్నవరంలో హజ్ యాత్రను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర.. ఇమాం, మౌజంలకు ఆర్ధిక సాయం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. హజ్ యాత్రకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1987 మంది వెళ్తుండగా విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి 353 మంది వెళ్తుండడం హర్షణీయమన్నారు. మైనార్టీల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పారు. ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావిస్తూ జీవితంలో ఒక్కసారి అయినా మక్కా వెళ్లాలని కోరుకుంటారని తెలిపారు. అలాంటి హజ్ యాత్రను రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించడంతో పాటుగా అన్ని సదుపాయాలు కల్పించడం ప్రభుత్వానికి మైనార్టీ సోదరుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.






