చంద్రబాబు ఇంటిపై దాడి కేసు.. విచారణకు సహకరించని జోగి రమేశ్

by Vemula.Srinu Prasad |

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ విచారణకు సహకరించలేదని మంగళగిరి డీఎస్పీ మురళీ కృష్ణ తెలిపారు..

చంద్రబాబు ఇంటిపై దాడి కేసు.. విచారణకు సహకరించని జోగి రమేశ్
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ మంగళగిరి పోలీసుల విచారణకు హాజరయ్యారు. అయితే జోగి రమేశ్ విచారణకు సహకరించటం లేదని మంగళగిరి డీఎస్పీ మురళీ కృష్ణ అన్నారు. విచారణ సమయంలో అడిగిన వాటిని అందచేయ్యాల్సిన బాధ్యత నిందితుడిపై ఉందని తెలిపారు. సెల్ ఫోన్, సీమ్ కార్డు ఇవ్వకుండా లాయర్లు ఏవో సెక్షన్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. జోగి రమేశ్‌ను మళ్లీ విచారించే అవకాశం ఉందని డీఎస్పీ మురళీ పేర్కొన్నారు.

Next Story