- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మచిలీపట్నం అభివృద్ధిలో వెనుకబడకూడదు
దశాబ్దాల చరిత్ర కలిగిన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో వెనుకబడకుండా చూసుకుంటానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

దిశ, మచిలీపట్నం : దశాబ్దాల చరిత్ర కలిగిన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో వెనుకబడకుండా చూసుకుంటానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. 48వ డివిజన్లో డ్రైనేజీ పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 35వ డివిజన్ రాజుపేట కొత్త మసీదు సెంటర్లో మూడు కల్వర్టులు, రెండు డ్రైన్ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 48వ డివిజన్ నిజాం పేట రంగా విగ్రహం పక్క రోడ్డులో కల్వర్టు మరియు హెచ్డీపీఈ పైపులైన్ పనులను ప్రారంభించారు.
అనంతరం నిర్వహించిన సభలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. సుమారు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన మచిలీపట్నం మున్సిపాలిటీని 2014-19 మధ్య కార్పొరేషన్‌గా మార్చామన్నారు. వడ్డె రంగారావు చొరవతో మచిలీపట్నంలో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మించారన్నారు. తర్వాత నడకుదిటి నరసింహరావు, బచ్చుల అర్జునుడు మచిలీపట్నంలో సిసి రోడ్లకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రస్తుతం 95 శాతం వరకు ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు నిర్మించామని పేర్కొన్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామన్నారు. నేను తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసి వెంటనే నియోజకవర్గంలో సిసి రోడ్ల నిర్మాణాలకు పెద్దపీట వేశానని చెప్పారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టానన్నారు. మంచినీటి ఇబ్బందులు పరిష్కరించడం లక్ష్యంగా 20 ఎం.ఎల్.డి వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టామన్నారు. 8 రిజర్వాయర్లు నిర్మించడంతోనే అన్ని ప్రాంతాల్లో తాగునీరు అందిస్తున్నాం అన్నారు. విద్యుత్ సమస్యలను కూడా శాశ్వతంగా పరిష్కరించబోతున్నామని ప్రకటించారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో పెట్టుబడిదారులకు భరోసా కల్పించామన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. వారి కష్టానికి ప్రజలంతా సహకరించడం ద్వారా మాత్రమే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంఛార్జి పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, జనసేన నాయకులు వాసు, భాగ్యరాజు, మద్ది వెంకటేశ్వరరావు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.






