Krishna | సీఐ జీప్ డ్రైవర్ అశ్లీల నృత్యాలు

by Thanuru Gopichand |

జోరు మీద అశ్లీల నృత్యాలు వేసి విధుల నుంచి తప్పించబడ్డాడు ఓ హోంగార్డు.

Krishna | సీఐ జీప్ డ్రైవర్ అశ్లీల నృత్యాలు
X

దిశ, వెబ్ డెస్క్ : జోరు మీద అశ్లీల నృత్యాలు వేసి విధుల నుంచి తప్పించబడ్డాడు ఓ హోంగార్డు. అతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసు ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కంకిపాడు రూరల్ సీఐ జీపు డ్రైవర్ అజయ్ కుమార్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో రికార్డింగ్ డాన్సులు వేసే యువతితో కలిసి అశ్లీల నృత్యాలు చేసినట్లుగా కనిపిస్తోంది. అక్కడ చిన్న పిల్లలు, మహిళలు ఉన్నారనే విషయాన్ని కూడా గ్రహించకుండా అతను మహిళతో డాన్సులో మునిగి తేలాడు. దాన్ని చిత్రీకరించిన వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో విషయం వైరల్ అయ్యింది. అది కాస్త ఉన్నతాధికారులకు చేరింది. ఫిర్యాదులు కూడా వెల్లువెత్తడంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. హోంగార్డు అజయ్ కుమార్ ను విధుల నుంచి తప్పిస్తూ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

Next Story