- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుట్టెడు దు:ఖంలోనూ అవయవదానం చేసిన కుటుంబం.. అండగా నిలిచిన పవన్ కల్యాణ్
పుట్డెడు దు:ఖంలోనూ అవయదానం చేసిన కుటుంబాన్ని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు..

దిశ, వెబ్ డెస్క్: పుట్డెడు దు:ఖంలోనూ అవయదానం చేసిన కుటుంబాన్ని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) పరామర్శించారు. కృష్ణా జిల్లా(Krishna District) కృత్తివెన్ను మండలం పెదచందాల(Pedachandala)కు చెందిన జనసేన(Janasena) కార్యకర్త చందు వీరవెంకట వసంతరాయలు(Vasantharayulu) గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యారు. దీంతో ఆయన అవయవదానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. ఐదుగురికి ప్రాణం పోశారు. అప్పట్లోనే ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు తాజాగా పెదచందాలకు వెళ్లారు. వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించారు. వసంతరాయలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ దృష్టికి సమస్యలు దృష్టికి వచ్చాయి. దీంతో తాను అండగా ఉంటానని వసంతరాయులు కుటుంబానికి హామీ ఇచ్చారు. వసంతరాయులు కుటుంబం చేసిన త్యాగం స్ఫూర్తిదాయకమని పవన్ కల్యాణ్ కొనియాడారు.






