ఇంటర్నేషనల్ స్థాయికి ఇందిరాగాంధీ స్టేడియం.. త్వరలో మ్యాచులు..?

by Vemula.Srinu Prasad |

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియాన్ని ఇంటర్నేషనల్ స్థాయికి మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది...

ఇంటర్నేషనల్ స్థాయికి ఇందిరాగాంధీ స్టేడియం.. త్వరలో మ్యాచులు..?
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం(Vijayawada Indira Gandhi Stadium)లో ఇప్పటి వరకూ జాతీయ స్థాయిలోనే క్రికెట్ మ్యాచులు జరిగాయి. అయితే కూటమి ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తూ ఈ స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం స్థాయికి తీర్చిదిద్దేలా రూ. 53 కోట్లు కేటాయిచింది. తొలి విడతగా అధికారులు రూ.30 కోట్లలో పనులు ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాదికి ఈ పనులను పూర్తి చేయాలని గడువు పెట్టుకున్నారు. ఆ తర్వాత స్టేడియాన్ని అంతర్జాతీయ క్రీడలకు వేదికగా మార్చాలని భావిస్తున్నారు ఈ మేరకు స్టేడియాన్ని అన్ని ప్రమాణాలతో ఆధునికీకరణ చేస్తున్నారు. రాష్ట్ర శాప్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ పనులు చేపట్టనున్నాయి.

Next Story