రంగా ఆశయ సాధనకు కృషి చేస్తా : వంగవీటి ఆశా కిరణ్

by Thanuru Gopichand |

వంగవీటి మోహన రంగా (Vangaveeti Mohana Ranga) ఆశయ సాధనకు కృషి చేస్తానని ఆయన కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ (Asha Kiran) ప్రకటించారు.

రంగా ఆశయ సాధనకు కృషి చేస్తా : వంగవీటి ఆశా కిరణ్
X

దిశ, వెబ్ డెస్క్ : వంగవీటి మోహన రంగా (Vangaveeti Mohana Ranga) ఆశయ సాధనకు కృషి చేస్తానని ఆయన కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ (Asha Kiran) ప్రకటించారు. ఆదివారం విజయవాడ (Vijayawada) బందరు రోడ్డులోని వంగవీటి రంగా విగ్రహానికి పూల మాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆశా కిరణ్ మాట్లాడుతూ రాధా రంగా మిత్రా మండలి (Radha Ranga Mitra Mandali) ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు. పబ్లిక్ లైఫ్ కు కొంత కాలం దూరంగా ఉన్నానని పేర్కొన్నారు. ఇకపై పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువవుతానని తెలిపారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా నిలుస్తానని తెలిపారు. రాధా రంగా మిత్ర మండలి మధ్య గ్యాప్ ఉందని అభిప్రాయపడ్డారు. ఆ గ్యాప్ ను పూరించడానికి తాను వస్తున్నానని వెల్లడించారు. కుల, మత బేధాలకు తావులేకుండా ప్రజలకు సహాయం చేసిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన రంగా అని గుర్తు చేశారు.

ప్రస్తుతం ఏ పార్టీలోకి వెళ్లాలి అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆశా కిరణ్ తెలిపారు. తన సోదరుడు రాధా, తన బాటలు వేరైనా ఆశయం మాత్రం ఒక్కటేనన్నారు. కుటుంబ బాధ్యతల కారణంగా నేటి వరకు బయటకు రాలేదన్నారు. ఇక నుంచి రంగా అభిమానులను కలుస్తానన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, అవసరం వచ్చినా తాను ఉన్నానని స్పష్టం చేశారు. కేవలం కాపు కులానికే కాదు, రంగా అన్ని కులాల వారికి చెందినవారు అన్నారు. తాను కూడా అంతేనని ప్రకటించారు.

అయితే మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ దుబాయ్ పర్యటనలో ఉండగా ఆశాకిరణ్ రాజకీయ ఎంట్రీపై చర్చ కొనసాగడం చర్చనీయాంశం అయ్యింది. విజయవాడలో ఫ్యామిటీ పాలిటిక్స్ ను ఆసక్తికరంగా మార్చాయి.

Next Story