శాంతి భద్రతల పరిరక్షణపై ఫోకస్.. హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-17 12:20:56  IST  )

శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యమని హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు..

శాంతి భద్రతల పరిరక్షణపై ఫోకస్.. హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: విభజన తర్వాత రాష్ట్రంలో సరియైన పోలీసు శిక్షణ కేంద్రాలు లేవని, 2014–19 టీడీపీ ప్రభుత్వ హయాంలో మచిలీపట్నం(Machilipatnam) మండలం కరగ్రహారం(karagraharam)లో పోలీసు శిక్షణ కేంద్రం(Police Training Centre) ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, దాంతో అది ముందుకు సాగలేదని హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) అన్నారు. కరగ్రహారంలో జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆమె ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. పోలీసు శాఖలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టామని చెప్పారు. పోలీసు వ్యవస్థను పటిష్టం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

‘‘నేరాలు, గంజాయి వంటి మత్తు పదార్థాలను అరికట్టేందుకు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. ఈ రోజుల్లో సైబర్ నేరాలు అధికమైపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ఈ కేంద్రంలో శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో మెరైన్ పోలీసు స్టేషన్‌ను పునరుద్ధరిస్తాం.’’ అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

Next Story