- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నంద్యాలలో కొట్టుకున్న హిజ్రాలు...కారంపొడి చల్లుకొని మరీ !
నంద్యాలలో ( Nandyal ) దారుణం చోటుచేసుకుంది. హిజ్రాలే ( Hijras ) ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. బిక్షాటన విషయంలో.. హిజ

దిశ, వెబ్ డెస్క్: నంద్యాలలో ( Nandyal ) దారుణం చోటుచేసుకుంది. హిజ్రాలే ( Hijras ) ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. బిక్షాటన విషయంలో.. హిజ్రాల వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాలలో బిక్షాటన విషయంలో రూరల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ముందే.. హిజ్రాలు తన్నుకున్నారు. రాళ్లు అలాగే కారంపొడి చల్లుకొని మరి... రెచ్చిపోయారు హిజ్రాలు.
ఒకరిపై ఒకరు దాడి చేసుకొని వీరంగం సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిక్షాటన విషయంలో పాణ్యం (Panyam ), అలాగే నంద్యాలకు చెందిన రెండు హిజ్రాల ( Hijras Clash ) వర్గాల మధ్య కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. నంద్యాలలో భిక్షాటన చేయడానికి పాణ్యం వర్గం ప్రయత్నిస్తోంది. అయితే దీన్ని నంద్యాల వర్గం అడ్డుకుంటుంది.
ఈ నేపథ్యంలోనే రెండు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇవాళ రూరల్ పోలీస్ స్టేషన్ ముందు రెండు వర్గాలు ఎదురుపడ్డాయి. ఇంకేముంది.. వివాదం కాస్త గొడవ దాకా వెళ్ళింది. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకొని కొట్టుకున్నారు. దీంతో రంగం లోకి దిగిన పోలీసులు... హిజ్రాలపై లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. అనంతరం వారందరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ( police ). ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకొని ఆ పంచాయతీ తెంపే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. పాణ్యం (Panyam ), అలాగే నంద్యాలకు చెందిన రెండు హిజ్రాల ( Hijras Clash ) వర్గాల పై కేసులు పెట్టి విచారణ చేస్తున్నారు.
నంద్యాలలో కొట్టుకున్న హిజ్రాలు
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2025
బిక్షాటన విషయంలో హిజ్రాల వర్గాల మధ్య ఘర్షణ
నంద్యాలలో బిక్షాటన విషయంలో రూరల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ల ముందే కారంపొడి చల్లుకొని, రాళ్లతో దాడులకు పాల్పడి వీరంగం సృష్టించిన హిజ్రాలు
బిక్షాటన విషయంలో పాణ్యం, నంద్యాలకు చెందిన హిజ్రాల వర్గాల మధ్య… pic.twitter.com/VoEanzJjFY
నంద్యాలలో కొట్టుకున్న హిజ్రాలు
— Telugu Scribe (@TeluguScribe) March 28, 202
బిక్షాటన విషయంలో హిజ్రాల వర్గాల మధ్య ఘర్షణ
నంద్యాలలో బిక్షాటన విషయంలో రూరల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ల ముందే కారంపొడి చల్లుకొని, రాళ్లతో దాడులకు పాల్పడి వీరంగం సృష్టించిన హిజ్రాలు
బిక్షాటన విషయంలో పాణ్యం, నంద్యాలకు చెందిన హిజ్రాల వర్గాల మధ్య… pic.twitter.com/VoEanzJjFY






