- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడలో హైఅలర్ట్.. రంగంలోకి దిగిన సీపీ
మొంథా తుఫాన్ నేపథ్యంలో విజయవాడ పోలీసులు (Vijayawada Police) అప్రమత్తంగా ఉన్నట్లు సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాన్ నేపథ్యంలో విజయవాడ పోలీసులు (Vijayawada Police) అప్రమత్తంగా ఉన్నట్లు సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. నగరంలోని చిట్టినగర్ (Chitti Nagar) కొండ ప్రాంతాన్ని పోలీసు సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. నగరంలో ప్రమాదకరంగా ఉన్న హోర్డింగులను ముందస్తు చర్యల్లో భాగంగా తొలగించామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పడిపోయే విధంగా ఉన్న చెట్లను తొలగించడం, అవసరమైన చోట చెట్ల కొమ్మలను కత్తిరించడం చేయించామన్నారు. ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. విజయవాడ (Vijayawada) నగరంలోకి పెద్ద లారీలు, ట్యాంకర్లు రాకుండా జాగ్రత్త పడుతున్నామన్నారు. పునరావాస కేంద్రాలకు ప్రజలు వెళ్తే వారి నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నిఘా (Surveillance) ఉంచుతామన్నారు. కలెక్టరేట్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (Command Control Centre) ఉందన్నారు. ప్రభుత్వ సహాయక చర్యలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు.






