Governor Harichandan ముఖ్య కార్యదర్శిగా ఏకే సింఘాల్ బాధ్యతలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-02-04 12:52:12  IST  )

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ ముఖ్యకార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. ..

Governor Harichandan ముఖ్య కార్యదర్శిగా ఏకే సింఘాల్ బాధ్యతలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ ముఖ్యకార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ రాజ్ భవన్‌లో బాధ్యతలు చేపట్టిన అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు కొద్దిసేవు పలు అంశాలపై చర్చించారు. కాగా ఏకే సింఘాల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కీలకమైన శాఖలలో పని చేశారు. అత్యంత కీలకమైన డీఓపీటీ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అనంతరం ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్‌గా పని చేశారు. కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా సేవలు అందించి రాష్ట్ర ప్రజల మన్ననలు అందుకున్నారు. అలాగే టీటీడీ ఈవోగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఏకే సింఘాల్ దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా పని చేస్తుండగా గవర్నర్ ముఖ్యకార్యదర్శిగా బదిలీ అయిన సంగతి తెలిసిందే.

Next Story