ముగిసిన జోగి రమేశ్ సోదరుల విచారణ.. జైలుకు తరలింపు

by Vemula.Srinu Prasad |

నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ సోదరులకు నాలుగో రోజు కస్టడీ ముగిసింది...

ముగిసిన జోగి రమేశ్ సోదరుల విచారణ.. జైలుకు తరలింపు
X

దిశ, వెబ్ డెస్క్: నకిలీ మద్యం కేసు(Fake Liquor)లో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్(Jogi Ramesh) సోదరుల నాలుగో రోజు కస్టడీ ముగిసింది. ఐదు రోజుల కస్టడీలో భాగంగా ఇప్పటివరకూ నాలుగో రోజుల పాటు వాళ్లిద్దర్నీ సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో జోగి రమేశ్, ఆయన సోదరుడు రాము ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే నకిలీ మద్యం వ్యవహారంలో మరింత విచారించేందుకు జోగి రమేశ్ ను, ఆయన సోదరుడు రామును మరింత విచారించాలని కోర్టును సిట్ అధికారులు అభ్యర్థించారు. ఈ మేరకు ఐదు రోజుల పాటు విచారణకు అనుమతి లభించింది.

దీంతో నాలుగు రోజుల పాటు వాళ్లిద్దరికీ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదివారం కూడా కస్టడీకి తీసుకొని ఐదో రోజు కూడా ప్రశ్నించనున్నారు. ఇప్పటికే నాలుగో రోజుల పాటు అడిగి ప్రశ్నలకు జోగి రమేశ్ సోదరుల చెప్పిన స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. ఐదు రోజుల కస్టడీ తర్వాత కోర్టుకు అప్పగించనున్నారు. శనివారం కస్టడీ ముగియడంతో తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. సోమవారం ఉదయం మరోసారి కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు. మరో నిందితుడు జనార్ధన్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్నారు.

Next Story