రంగు మారుతున్నా పట్టించుకోరా?: Devineni uma

by srinivas |   ( Updated:2022-12-11 16:51:44.0  )
రంగు మారుతున్నా పట్టించుకోరా?: Devineni uma
X

దిశ, ఏపీ బ్యూరో: తడిసిన ధాన్నం కొనుగోలు చేయాలని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం ఎన్టీఆర్ జిల్లాలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం రంగు మారుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. టీడీపీ హయాంలో తడిసి ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు చేస్తారని సీఎం జగన్ మాయ మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. మార్కెట్ యార్డులకు రంగులు వేసుకునేందుకు ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలుపై లేదని విమర్శించారు. ఆరు నెలల పాటు రైతులు కష్టపడి పండించిన పంట పాలకుల పుణ్యమా అంటూ వర్షార్పణం అవుతుందని దేవినేని ఉమ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed