- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయికృష్ణ ఉదంతంపై కేశినేని నాని సీరియస్.. NHRCకు ఫిర్యాదు
విజయవాడ లాకప్ డెత్ ఉదంతంపై మాజీ ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ లాకప్ డెత్(Vijayawada Lockup Death) ఉదంతంపై మాజీ ఎంపీ కేశినేని నాని(Former MP Kesineni Nani) ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కు ఫిర్యాదు చేశారు. థర్డ్ డిగ్రీ గాయాలు బయటపడకుండా ఉండేందుకే గాదె సాయికృష్ణ(Gade Saikrishna) మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారని నాని పేర్కొన్నారు. ఫోరెన్సిక్, DNA సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు, సాయికృష్ణ అస్థికలను కృష్ణానదిలో కలిపేశారని తెలిపారు. 'కమాండ్ రెస్పాన్సిబిలిటీ' కింద ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ (CP) ఎస్.వి. రాజశేఖర బాబును తక్షణమే సస్పెండ్ చేయాలని కోరారు. విజయవాడలో పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ మరిచి, మాఫియాల కొమ్ముకాస్తూ "ప్రైవేట్ సెటిల్‌మెంట్ సిండికేట్" నడుపుతున్నారని ఆరోపించారు. సాయికృష్ణ అక్రమ నిర్బంధం, హత్యపై సెక్షన్ 176(1A) కింద తక్షణమే స్వతంత్ర జ్యుడీషియల్ విచారణ జరపాలని కేశినేని నాని విజ్ఞప్తి చేశారు.






