జోగి రమేశ్‌తో టచ్‌లో టీడీపీ నేతలు.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-12-17 10:53:05  IST  )

మంత్రి పార్థసారథి, టీడీపీ నేతలు కొనకళ్ల నారాయణ, గౌతు శిరీష‌పై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

జోగి రమేశ్‌తో టచ్‌లో టీడీపీ నేతలు.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి పార్థసారథి(Minister Parthasarathy), టీడీపీ నేతలు కొనకళ్ల నారాయణ, గౌతు శిరీష‌(Gautu Sirisha)పై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న (Former MLC Buddha Venkanna) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు(Eluru District Nujiveedu)లో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో రాసుకు, పూసుకుని తిరగడాన్ని ఆయన తప్పు బట్టారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేసిన జోగి రమేశ్(Jogi Ramesh)... అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయడు(CM Chandrababu Naidu) ఇల్లు, పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనను గుర్తు చేస్తూ తనకు జరిగిన అవమానంపైనా ఆయన బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ సమయంలో జరిగిన వివాదం వంటి అంశాలతో కూడిన ఫోటోలను ఆయన ప్రదర్శించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ నూజివీడు‌లో జోగి రమేశ్ పాల్గొన్న ఘటన అందరికీ బాధ కలిగించిందన్నారు. చంద్రబాబు ఇంటి పైకి వెళ్లిన వ్యక్తి జోగి రమేశ్ అని గుర్తు చేశారు. నీచంగా దూషణలు చేసి చంద్రబాబుకు బాధ కలిగించిన వ్యక్తి జోగి రమేశ్ అని వ్యాఖ్యానించారు. అటువంటి నాయకుడితో టీడీపీ మంత్రి, నేతలు కలిసి ర్యాలీ చేయడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. జోగి రమేష్‌తో వేదిక పంచుకున్న ఘటన చంద్రబాబు గుండెలు మీద తన్నిన విధంగా ఉందన్నారు. తమ నాయకులను తాను ఏమీ అనలేనని, కానీ అలా జరగకుండా చూసుకోవాల్సిందని బుద్దా వెంకన్న సూచించారు.

‘‘జోగి రమేశ్‌ను మేము అడ్డుకుని ఉండకపోతే ఆరోజు చంద్రబాబు ఇంటి గేటును తాకేవాడు. మేము అడ్డుకున్న సమయంలో పోలీసులు మాపై దాడి చేశారు. ఆ గలాటాలో నాకు ఊపిరి అందక కింద పడ్డా. చనిపోతానని అందరూ అనుకున్నారు. ఆ పక్కనే అప్పుడు గద్దె రామ్మోహన్, ఏలూరి సాంబశివరావు‌లు కూడా ఉన్నారు. నూజివీడు ఘటన మాత్రం కరెక్ట్ కాదు. ఎలా జరిగినా... అక్కడ ఉన్న మీరు బాధ్యత వహించాల్సి ఉంది. జోగి రమేశ్‌ను చూశాక అయినా వేదిక నుంచో, ర్యాలీ నుంచో దూరంగా వచ్చేసి ఉండాల్సింది. గౌతు లచ్చన్న ఒక కుల నాయకుడు కాదు. గౌతు శిరీష అంటే మాకు కూడా ఎంతో అభిమానం ఉంది. కానీ నిన్న జరిగిన ఘటన కారణంగా క్యాడర్ మొత్తం చాలా బాధ పడింది. పార్థసారథి, కొనకళ్ల నారాయణ, శిరీష లు ముగ్గురూ సౌమ్యులే. కేవలం క్షమాపణ చెబితే సరిపోదు.. క్యాడర్‌కు సమాధానం చెప్పాలి.’’ అని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.

Next Story