- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతిలో సీఎం చంద్రబాబు కొత్త ఇల్లు.. మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని అమరావతి లో కొత్త ఇల్లు నిర్మించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇంటి పక్కన ఎవరూ ఉండేందుకు వీల్లేదా...? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు....

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) ఏపీ రాజధాని అమరావతి(Ap Capitla Amaravati)లో కొత్త ఇల్లు(New House) నిర్మించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇంటి పక్కన ఎవరూ ఉండేందుకు వీల్లేదా...? అని మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) ప్రశ్నించారు. అంతేకాదు అమరావతిలో అడ్డగోలుగా ప్లాట్ల కేటాయింపు జరుగుతోందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఇంటి పక్కన ఉన్న 3800 గజాలు గ్రీన్ బెల్ట్‌గా ఎలా మారిందని నిలదీశారు. రెసిడెన్సియల్ ఏరియా గ్రీన్ బెల్ట్ ఎలా అయ్యిందని ప్రశ్నించారు. చంద్రబాబు కడుతున్న ఇంటిని ఏ ప్యాలెస్ అనాలని వ్యాఖ్యానించారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు మధ్యలోనే చంద్రబాబుకు ఫ్లాటు ఎలా వచ్చిందన్నారు. సాధారణ రైతుకు ఎందుకు ఇవ్వలేదన్నారు. చంద్రబాబు ఇంటికి సమీపంలో రైతులకు ఫ్లాట్లు ఉండొద్దా అని మండిపడ్డారు. కానీ చంద్రబాబు బినామీలకు మాత్రం అమరావతిలో న్యాయం జరుగుతోందని పేర్ని నాని వ్యాఖ్యానించారు. అవినీతికి మారుపేరుగా అమరావతిని మార్చేశారని పేర్ని నాని విమర్శించారు.






