- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వృధా ఖర్చు.. ఉపసంహరించుకోండి: PPP విధానంపై పేర్ని నాని కీలక డిమాండ్
పేదవాడు వైద్యుడిగా తయారయ్యే దారి ప్రభుత్వ వైద్య కళాశాలలే అని, అభివృద్ధి పేరిట లక్షల కోట్లు వృధాగా ఖర్చు చేసే పిపిపి విధానాన్ని ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు....

దిశ, వెబ్ డెస్క్: పేదవాడు వైద్యుడిగా తయారయ్యే దారి ప్రభుత్వ వైద్య కళాశాలలే అని, అభివృద్ధి పేరిట లక్షల కోట్లు వృధాగా ఖర్చు చేసే పిపిపి విధానాన్ని ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి పేర్ని నాని(Former Minsiter Perni Nani) అన్నారు. నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను వాటికి అనుబంధంగా ఆసుపత్రులను తక్షణమే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో 2029 ఎన్నికల కౌంటింగ్ జరిగే సాయంత్రం వరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ పోరాటం చేస్తుందని పేర్ని నాని హెచ్చరించారు. నిర్మాణంలో ఉన్న 10 మెడికల్ కళాశాలలను ప్రభుత్వం వెంటనే నిర్మించాలనే అంశంపై విజయవాడ ఎంబీభవన్‌లో నిర్వహించిన చర్చా గోష్టిలో ఆయన పాల్గొన్నారు.
ఆ ఘనత మాదే
ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదే అని, నేడు కూటమి ప్రభుత్వం వైద్య విద్య ప్రభుత్వానికి సంబంధం లేని పరిస్థితికి తీసుకొచ్చిందని, మన కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి తెలంగాణలో ఫ్రీ సీటు దొరుకుతుందని, వెనుక బడిన కులాలకు వైద్య విద్యను దూరం చేసే ప్రక్రియను విడనడాలని హితవు పలికారు. ప్రజల ఆస్తులను అమ్మి ప్రభుత్వాన్ని నడపాలనే ఆలోచనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వస్తి పలకాలని, పాపం చేయబోతున్నామనే అపరాధ భావంతోనే మెడికల్ కాలేజీల టెండర్ల లో ఎవరు పాల్గొనడం లేదని అన్నారు. . ప్రభుత్వ వైద్య కళాశాల పరిరక్షణకై ప్రజా సంఘాలు జరిపే పోరాటానికి తాము మద్దతుగా నిలుస్తామని పేర్ని నాని హామీ ఇచ్చారు.






