- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసిస్టెంట్ కమిషనర్ గోపాల్‌రావు ఇల్లు కూల్చేస్తా: పేర్ని నాని స్ట్రాంగ్ వార్నింగ్
బందరులో పని చేస్తున్న మున్సిపల్ అధికారులకు మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాము అధికారం వచ్చిన వెంటనే తామేంటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు...

దిశ, వెబ్ డెస్క్: బందరు(Bandaru)లో పని చేస్తున్న మున్సిపల్ అధికారులకు మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాము అధికారం వచ్చిన వెంటనే తామేంటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. బందరులో అనుమతి లేని నిర్మాణాలను కూల్చివేయడంపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్, పోలీసు అధికారులపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు ఎక్కడ ఉన్నా బందరు తీసుకొచ్చి తామేంటో చూపిస్తామన్నారు. ఇప్పుడు మంత్రి కొల్లు రవీంద్రకు తొత్తులుగా పని చేసిన ప్రతి ఒక్కరినీ వదలిపెట్టేది లేదన్నారు. ఇదే పోలీసులను పెట్టి తమ ఇళ్లను కూడా కూల్చివేస్తామని హెచ్చరించారు. కుమ్మర్లు, తూర్పుకాపుల ఇళ్లను కూల్చివేసిన బాధ ఏంటో చూపిస్తామన్నారు. జేసీబీలు, గుణపాలు దిగితే ఎలాగుంటుందో ఇదే మున్సిపల్ కమిషనర్ బాపిరాజు చౌదరికి తెలిసేలా చేస్తానన్నారు. బందరు వదిలి వెళ్లిపోయినా అసిస్టెంట్ కమిషనర్ గోపాల్ రావు ఇంటి సంగతి చూస్తానని ఇచ్చారు. మంత్రి కొల్లు రవీంద్ర చెప్పినట్లు ఆడుతున్న మున్సిపల్ కమిషనర్ బాపిరాజు చౌదరిని కూడా వదిలిపెట్టమని పేర్ని నాని వార్నింగ్ ఇచ్చారు. ఏసీపీ ఇంటికి ప్లాన్ లేదని, పీపీవో, పీపీఎస్ ఇళ్లను కూడా కూల్చేస్తామని హెచ్చరించారు.






