- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
High Court: పేర్ని నానికి రిలీఫ్.. ముందస్తు బెయిల్‌పై కీలక ఆదేశాలు

దిశ వెబ్ డెస్క్: మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani)కి కాస్త రిలీఫ్ లభించింది. రేషన్ బియ్యం మాయం కేసు(Ration Rice Missing Case)లో ఆయన హైకోర్టు(HIgh Court)ను ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్(Anticipatory bail) మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్(Pittion)పై సోమవారం ధర్మాసనం(Tribunal) విచారించింది. ఇరువర్గాల వాదనల విన్న కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం వరకు పేర్ని నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
కాగా పేర్ని నాని సతీమణి జయసుధకు సంబంధించిన మిల్లులో రేషన్ బియ్యం మాయం అయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పేర్ని నానితో పాటు ఆయన భార్య జయసుధతో పాటు మరికొంతమందిపై అభియోగాలు మోపారు. ఈ మేరకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. అయితే జయసుధ కోర్టు ఆదేశాలతో పోలీసుల విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరుకాకపోవడంతో పేర్నినానిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ విచారణ నేపథ్యంలో గురువారం వరకు పేర్నినాని ఊరట లభించింది.