- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీఎస్సార్ ఆంజనేయులకు బిగ్ షాక్.. మూడు రోజుల కస్టడీకి అనుమతి
మాజీ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు విజయవాడ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది...

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు(Former IPS officer PSR Anjaneyulu)కు విజయవాడ కోర్టు(Vijayawada Court)లో ఎదురుదెబ్బ తగిలింది. నటి జత్వానీ కేసు(Actress Jatwani case)లో మరింత విచారించేందుకు ఆంజనేయులను మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ(CID) పోలీసుల అభ్యర్థనకు విజయవాడ కోర్టు అనుమతించింది. ఈ కేసులో ఇప్పటికే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో ఆయనను శని, ఆది, సోమవారం కస్టడీకి తీసుకోనున్నారు. న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు నటి జత్వానీ కేసులో విజయవాడ సీఐడీ కార్యాలయంలో నిందితుడు ఆంజనేయులను ప్రశ్నించనున్నారు.
కాగా ముంబై నటి జత్వానీని బెదిరించి అక్రమంగా కేసులు పెట్టారని సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ కోర్టుకు తరలించారు. ప్రధాన నిందితుడు విద్యాసాగర్ కు, పీఎస్సార్‌కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఇదే కేసులో విద్యాసాగర్‌ను అరెస్ట్ చేశారు. మరికొందరు బెయిల్‌పై విడుదల అయ్యారు. ప్రస్తుతం పీఎస్సార్ ఆంజనేయులను సీఐడీ అధికారులు విచారించనున్నారు.






