- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: జైలుకు వల్లభనేని వంశీ.. 14 రోజుల రిమాండ్
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhanani Vamsi)ని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయం(Tdp Gannavaram Office)పై దాడి కేసుకు సంబంధించి కోర్టులో విచారణ సందర్భంగా వ్యక్తిని కిడ్నాప్ చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో 8 గంటల పాటు విచారించారు. అనంతరం జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం వంశీకి 14 రోజుల రిమాండ్‌ను విధించింది. ఈ మేరకు వల్లభనేనిని పోలీసులు జైలుకు తరలించాారు.
ఇక ఇదే కేసులో మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ1గా వల్లభనేని వంశీ, ఏ7గా శివరామ కృష్ణప్రసాద్, ఏ8గా నిమ్మ లక్ష్మీపతిగా చేర్చారు. వీరికి కూడా కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు జైలుకు తరలించారు.






