- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సీసీ ఫుటేజ్ భద్రపర్చండి: ఏసీబీ కోర్టులో వల్లభనేని పిటిషన్
విజయవాడ ఏసీబీ కోర్టును గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆశ్రయించారు...

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఏసీబీ కోర్టు(Vijaywada Acb Court)ను గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former Gannavaram MLA Vallabhaneni Vamsi) ఆశ్రయించారు. సత్యవర్థన్ కేసు(Satyavardhan case)కు సంబంధించి ఈ సంవత్సరం ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు విజయవాడ పడమట పీఎస్(Vijayawada West PS)లోని రికార్డైన సీసీ ఫుటేజును భద్రపర్చాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై త్వరలో విచారణ జరిగే అవకాశం ఉంది.
సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలో వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. ఈ సమయంలో తొలుత విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ తీసుకెళ్లారు. ఆ తర్వాత విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారణలో భాగంగా వల్లభనేని వంశీని అదే పోలీస్ స్టేషన్‌లో మూడు గంటలపైగానే ఉంచారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే అప్పుడు రికార్డైన పీఎస్ సీసీ ఫుటేజ్ ను భద్రపర్చాలని ఆయన తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.






