- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Former Minister Velampally: లోకేశ్‌ది పనికిమాలిన యాత్ర
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్రపై మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సెటైర్లు వేశారు. లోకేశ్‌ది పనికి మాలిన యాత్ర అని అభివర్ణించారు...

X
దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్రపై మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సెటైర్లు వేశారు. లోకేశ్‌ది పనికి మాలిన యాత్ర అని అభివర్ణించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియ చేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. లోకేశ్ పాదయాత్ర ఫెయిల్ అయ్యిందని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తమ వెనుక వున్నంత జనం కూడా లోకేశ్‌తో లేరని ఎద్దేవా చేశారు. లోకేశ్ మాట్లాడేవి అన్ని బుతులేనని విమర్శించారు. లోకేశ్ వల్ల ప్రజలకు ఏమి ఉపయగం లేదని.. ఆయనది ఓ పనికిమాలిన యాత్ర అని దుయ్యబట్టారు.
Next Story






