- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోరం.. గూడ్స్ రైలుకింద పడి కుటుంబం ఆత్మహత్య
by Naga Rani Yarlagadda |
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. గూడ్స్ రైలు కింద పడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. గూడ్స్ రైలు కింద పడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. నలుగురి మృతదేహాలను ట్రాక్ పై చూసిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. దంపతులు సహా ఇద్దరు పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. మృతదేహాలను పోస్టుమార్టమ్ కు పంపిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఎవరు? ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారు? వేధింపులా లేక ఆర్థిక ఇబ్బందులే కారణమా? ఇలా అనేక కోణాల్లో విచారణ చేపట్టారు. కాగా.. మృతుల వివరాలను తెలుసుకునేందుకు రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






