తమను ఆదుకోవాలని వృద్ధ దంపతుల నిరసన.. మంత్రి లోకేష్‌కు రిక్వెస్ట్

by Bhoopathi Nagaiah |

ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట వృద్ధ దంపతులు నిరసనకు దిగారు.

తమను ఆదుకోవాలని వృద్ధ దంపతుల నిరసన..  మంత్రి లోకేష్‌కు రిక్వెస్ట్
X

దిశ, ఏపీ బ్యూరో: ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట వృద్ధ దంపతులు నిరసనకు దిగారు. కుంటముక్కల గ్రామానికి చెందిన ఈ దంపతులు భూ వివాదం పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఫోటోతో కార్యాలయం ఎదుట బైఠాయించి తమ సమస్యపై దృష్టి సారించాలని కోరారు. భూ సమస్య విషయంలో అనేకసార్లు అధికారులను సంప్రదించినప్పటికీ న్యాయం జరగలేదని ఆరోపించారు. గత ఐదు నెలలుగా ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరవుతున్నప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదని తెలిపారు. ఉన్నతాధికారులు ఆదేశించినప్పటికీ స్థానిక రెవెన్యూ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తమకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తామని వృద్ధ దంపతులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పని చేయలేని పరిస్థితిలో ఉన్న తమను ఆదుకోవాలని మంత్రి నారా లోకేష్‌ను వేడుకున్నారు.

Next Story