విజయవాడ విమానాశ్రయంలో ‘ఎబోలా’ వైరస్‌ స్క్రీనింగ్.. అప్రమత్తమైన ఏపీ సర్కార్!

by Ramesh Naini |

ఆఫ్రికా దేశాల్లో ఎబోలా (Ebola) వైరస్‌ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.

విజయవాడ విమానాశ్రయంలో ‘ఎబోలా’ వైరస్‌ స్క్రీనింగ్.. అప్రమత్తమైన ఏపీ సర్కార్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆఫ్రికా దేశాల్లో ఎబోలా (Ebola) వైరస్‌ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించారు.

లక్షణాలు ఉంటే క్వారంటైన్

విదేశీ ప్రయాణికులను నిశితంగా పరిశీలించేందుకు ఎయిర్‌పోర్టులో ప్రత్యేకంగా స్క్రీనింగ్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం సింగపూర్ నుంచి విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ఆరోగ్య సిబ్బంది ఎబోలా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. స్క్రీనింగ్ సమయంలో ఎవరికైనా ఎబోలా వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే, వారిని తక్షణం క్వారంటైన్‌కు తరలించేలా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రాణాంతక ఎబోలా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడికి ఈ పరీక్షలు తప్పనిసరి చేసినట్లు విమానాశ్రయ అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

Next Story