- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Heavy Rains: స్కూళ్లకు సెలవు
by Vemula.Srinu Prasad |
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగాభారీ వర్షాలు కురుస్తున్నాయి....

X
దిశ, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగాభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి తాహేరా సుల్తానా తెలిపారు. ఈ అత్యవసర సమాచారంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపవద్దని డీఈఓ కోరారు.
మరోవైపు రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యారు. పలు చోట్ట కరెంట్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Next Story






