ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం.. వైసీపీ నేత దేవినేని అవినాశ్

by Javid Pasha |

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని వైసీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాశ్ వెల్లడించారు.

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం.. వైసీపీ నేత దేవినేని అవినాశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని వైసీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాశ్ వెల్లడించారు. ‘‘మేమూ ఎన్టీఆర్ అభిమానులమే. ఎన్టీఆర్‌కు బ్యానర్లు కట్టే హక్కు మాకుంది. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి ఎవరూ రాసివ్వలేదు. టీడీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావన రాకుండా చేసేవారు’’ అని విమర్శించారు. దివంగత ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలు ఈ నెల 28న ఆదివారం విజయవాడలో నిర్వహిస్తామ‌ని పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబోతున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి హాజరవుతారని తెలిపారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టిన మనసున్న నేత సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. ఎన్టీఆర్ పేరును చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయేలా సీఎం వైఎస్ జగన్ చేశారని దేవినేని అవినాశ్ గుర్తు చేశారు.

Next Story