యువతకు స్పీకర్ అయ్యన్న కీలక పిలుపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-18 11:20:46  IST  )

విద్యార్థులు, యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి రావాలని డిప్యూటీ సీఎం అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు...

యువతకు స్పీకర్ అయ్యన్న కీలక పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థుల(Students)కు, యువత(Youth)కు ఏపీ ప్రభుత్వం(Ap Government) ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి కోసం ఎన్నో సంక్షేమం కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తోంది. రాజకీయాల్లోకి రావాలని కోరుతోంది. ఇందుకోసం అసెంబ్లీలో జరిగే సమావేశాలను ప్రత్యక్షంగా తిలకించేందుకు అవకాశం కల్పించింది. ఇప్పుడు తాజాగా విద్యార్థులకు పోలవరాన్ని కూడా వీక్షించే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీని సందర్శించిన విద్యార్థులను పోలవరం కూడా తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. అటు యువతకు కూడా స్పీకర్ అయ్యన్న కీలక పిలుపునిచ్చారు. ఉద్యోగాలకు పరిమితం కాకుండా యువత రాజకీయాల్లో రావాలన్నారు. ప్రజలకు సేవ చేయాలంటే నాయకత్వం స్వీకరించాలని ఆయన కోరారు. కాగా 300 మంది స్కూలు, కాలేజీ విద్యార్థులు బుధవారం రోజు అసెంబ్లీని సందర్శించారు.

Next Story