Target 175: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఇక నుంచి..!

by Disha Web Desk 16 |
Target 175: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఇక నుంచి..!
X

దిశ వెబ్ డెస్క్: సీఎం జగన్ పార్టీ పటిష్టపై దృష్టి సారించారు. పార్టీలోనూ వాలంటీర్ వ్యవస్థను తీసుకురానున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక ప్రతినిధిని నియమించనున్నారు. బూత్ లెవల్ కమిటీలను కూడా ఏర్పాటు చేసే దిశగా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు విజయవాడ జయహో బీసీ సభలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు.

కాగా 175 నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించే బాధ్యతను సీఎం జగన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇన్ని రోజులు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ గెలవాలని నేతలకు సూచించారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ ప్రజల వద్దకు వెళ్లాలని పిలుపునిచ్చారు. దీంతో 'గడప గడపకు మన ప్రభుత్వం' పేరుతో పట్టణాలు, గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే వార్డు వాలంటీర్ల వ్యవస్థను అమలు చేస్తున్నట్లుగా పార్టీలోనూ అదే వ్యవస్థను తీసుకు రావాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అడుగులు వేస్తున్నారు. ప్రతి 50 ఇళ్లకు వైసీపీ నుంచి ఒక ప్రతినిధి నియమించనున్నారు. ఈ ప్రతినిధిని ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలు, పార్టీ విధానాలను ప్రజలకు తెలియజేయనున్నారు. ఇలా ప్రజలందరిని ఆకర్షించేలా ప్రయత్నం చేస్తున్నారు.


Next Story

Most Viewed