జీతాలు పెంచరంట.. ప్రమోషన్ ఇస్తరంట.. జనరేషన్ zపై డ్రైప్రమోషన్ ఎఫెక్ట్!

by Disha Web Desk 8 |
జీతాలు పెంచరంట.. ప్రమోషన్ ఇస్తరంట..  జనరేషన్ zపై డ్రైప్రమోషన్ ఎఫెక్ట్!
X

దిశ, ఫీచర్స్ : ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ మంచి జీతం రావాలనే కోరిక, త్వరలోనే ప్రమోషన్ రావాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది.కానీ అందరికీ అలాంటి అవకాశాలు రావు, ప్రమోషన్‌కు ఒక్క అడుగు దూరంలోనే ఆగిపోతుంటారు. కానీ పాపం zజనరేషన్ ఉద్యోగస్థులకు మాత్రం చాలా కష్టంగా మారిందంట జాబ్ అనేది. ప్రస్తుతం డ్రై ప్రమోషన్ అనేది ట్రెండ్ అయిపోయింది.

డ్రై ప్రమోషన్ అంటే ప్రమోషన్ వస్తుంది కానీ, సాలరీ మాత్రం పెంచరు. ప్రస్తుతం చాలా కంపెనీలు దీనినే ఫాలో అవుతున్నాయంట. ఎన్నో రోజులుగా సాలరీ కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలు దీని వలన అడియాశలే అవుతున్నాయంటున్నారు నిపుణులు. ఈ డ్రై ప్రమోషన్ వలన ఉద్యోగుల్లో పనిచేయాలన్న ఉత్సాహం తగ్గిపోవడం, క్రియేటివ్‌గా ఆలోచించలేకపోవడానికి కారణం అవుతుందంట. సాలరీస్ పెరగకపోవడం, ప్రమోషన్ ఇవ్వడం వలన అది ఉద్యోగికి భారం అవుతుందంట. దీని వలన కోరుకున్న రిజల్ట్స్ రాకపోవచ్చు అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఇది 13 శాతం పెరిగిందంట.డ్రై ప్రమోషన్ల వల్ల కేవలం ఆర్థికపరమైన చిక్కులే కాదు.. ఉద్యోగి నైతికత, విధేయతపై తీవ్రప్రభావం చూపిస్తాయట. దీనివల్ల ఉద్యోగులు అసంతృప్తిగా, నిరాదరణకు గురవుతారు అంటున్నారు ఆర్థిక నిపుణులు. అందువలన ఉద్యోగులకు మంచి జీతం, సరైన సమయంలో ప్రమోషన్ ఇవ్వడం చాలా మంచిదంట.



Next Story

Most Viewed