- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన...వాళ్లకు డబ్బుల పంపిణీ
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu naidu) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బాపట్ల జిల్లాలో ( Bapatla )

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( CM Chandrababu naidu) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బాపట్ల జిల్లాలో ( Bapatla ) చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీన అంటే ఎల్లుండి బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు పింఛన్ల పంపిణీ ( Distribution of pensions ) చేస్తారు సీఎం చంద్రబాబు. బాపట్ల జిల్లా చిన గంజాం మండలం చిన్న గొల్లపాలెం లో ( Chinna Gollapalem ) పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఇందులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని... నిరుపేదలకు పింఛన్ల పంపిణీ చేస్తారు.
అనంతరం ప్రజా వేదిక ద్వారా... ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు ( Chandrababu naidu) ప్రసంగిస్తారు. సభ పూర్తి కాగానే గంటపాటు... బాపట్ల జిల్లా టిడిపి కార్యకర్తలతో సమావేశం కూడా నిర్వహిస్తారు. అనంతరం జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష ఉంటుంది. ఇక సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడకు చంద్రబాబు నాయుడు ( CM Chandrababu naidu) వస్తారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. కాగా జగన్మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy) ముఖ్యమంత్రి ఉన్నప్పుడు.. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ జరిగేది. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీఎం చంద్రబాబు, మంత్రులు కూడా పెన్షన్ పంపిణీలో పాల్గొంటున్నారు. దీనిపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి పెన్షన్లను పంపిణీ ( Distribution of pensions ) చేయడం... బాగుందని చెబుతున్నారు.






