- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు అమరావతిలో పర్యటించనున్న సీజేఐ బీఆర్ గవాయ్
by Thanuru Gopichand |
భారత సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్ నేడు అమరావతిలో (Amaravati) పర్యటించనున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : భారత సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్ నేడు అమరావతిలో (Amaravati) పర్యటించనున్నారు. శనివారం కుటుంబ సమేతంగా పుట్టపర్తిలో పర్యటించారు. పర్యటన అనంతరం ఎన్టీఆర్ జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ వి.రాజశేఖర బాబు (Police Commissioner) ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసు అధికారులు సీజేఐ బీఆర్ గవాయ్ కు గౌరవ వందనం సమర్పించారు. నేడు అమరావతిలో జరగనున్న రాజ్యాంగ పరిరక్షణ వేడుకలకు సీజేఐ హాజరవుతారు. రాజ్యాంగం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి, రాజ్యాంగం ప్రాముఖ్యాన్ని తెలియజేయడానికి ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.
Next Story






