- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయికృష్ణ కేసు: సిట్ కస్టడీకి సీఐ నాగరాజు
by Vemula.Srinu Prasad |
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టై అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్న సీఐ నాగరాజును మరింత విచారించాలని సిట్ నిర్ణయించుకుంది. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది. దీంతో విచారణ చేపట్టిన ధర్మాసనం సీఐ నాగరాజును 9 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ అనుమతి జారీ చేసింది. ఈ మేరకు సీఐ నాగరాజును శుక్రవారం కస్టడీకి తీసుకోనున్నారు. ఈ నెల 10వ తేదీ వరకూ ఆయన్ను మరింతగా విచారించనున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ వెనుక అసలు కారణాలేంటనే కోణంలో పోలీసులు విచారించే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. చూడాలి మరి.
Next Story






