- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబుకు చుక్కెదురు.. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరపున విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు అయింది...

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ చుక్కెదురైంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరపున విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. దీంతో కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని సీఐడీ తరపు న్యాయవాది కోరారు. సాయంత్రం 4 గంటలకు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి విచారణకు వస్తారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రత్యేక ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు జరుగుతుండటంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుకు త్వరగా బెయిల్ రావాలని కోరుకుంటున్నారు.
More News : కలవడం కుదరదు: Nara Bhuvaneshwari ములాఖత్ దరఖాస్తు తిరస్కరణ






