హుండీ డబ్బులు మాయం: అడ్డంగా దొరికిన ఈవో, ఇద్దరు అర్చకులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-11 11:13:06  IST  )

దేవుడి గుడిలో ఇంటిదొంగలు చేతివాటం చూపించారు. వాటాల కోసం మద్యం దుకాణంలో పంచాయితీ పెట్టుకుని అడ్డంగా దొరికిపోయారు....

హుండీ డబ్బులు మాయం: అడ్డంగా దొరికిన ఈవో, ఇద్దరు అర్చకులు
X

దిశ, వెబ్ డెస్క్: దేవుడి గుడిలో ఇంటిదొంగలు చేతివాటం చూపించారు. వాటాల కోసం మద్యం దుకాణంలో పంచాయితీ పెట్టుకుని అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన కృష్ణా జిల్లా యనమలకుదురులో జరిగింది. స్థానిక శివాలయంలో రూ. 10 లక్షలు హుండీ డబ్బులు మాయం అయ్యాయి. దీంతో దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఈవో, ఇద్దరు అర్చకులు చేసిన స్కామ్ బయటపడింది. అంతరాలయం తలుపులకు సంబంధించి మారుతాళం చేయించి దాని ద్వారా డబ్బులు కొట్టేశారు. ఒకేసారి తీస్తే డౌట్ వస్తుందని కొంచెం, కొంచెంగా హుండీ నుంచి నగదు తీస్తుకెళ్లారు. అలా మొత్తం రూ.10 లక్షలు చోరీ చేశారు.

దీంతో ఆలయ ట్రస్ట్ చైర్మన్ నరసింహారావు ఇచ్చిన ఫిర్యాదులతో అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. ఆలయ ఈవో, అర్చకులు నగదు మాయం చేసినట్లు నిర్దారణ అయింది. దీంతో ఇద్దరు పూజరులతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆలయ ఈవో భవానీ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నేరం చేసిన ఇద్దరు అర్చకులు, మరో ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే భవానీ స్థానంలో మరో ఈవో నియమించారు.

Next Story