- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంద్రకీలాద్రిపై దారుణం.. భిక్షాటన చేసుకునే స్వామిపై కానిస్టేబుల్ దాడి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అవుట్ పోస్టు పోలీసులు తీరు వివాదస్పదంగా మారింది. భక్తులు, స్థానికంగా భిక్షాటన చేసే వాళ్ల పట్ల ఓవరాక్షన్‌కు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి....

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రి(Vijayawada Indrakeeladri)పై అవుట్ పోస్టు పోలీసులు(Outpost Police) తీరు వివాదస్పదంగా మారింది. భక్తులు, స్థానికంగా భిక్షాటన చేసే వాళ్ల పట్ల ఓవరాక్షన్‌కు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వాళ్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అయితే తాజాగా జరిగిన ఘటన కూడా అవుట్ పోలీసుల పట్ల వ్యతిరేకతను పెంచుతోంది. ఇంద్రకీలాద్రిపై అవుట్ పోస్టు పోలీసులు భద్రత ఏర్పాట్లు చూస్తున్నారు. అయితే ఓ భిక్షటన చేసే స్వామి పట్ల అత్యుత్సాహం ప్రదర్శించారు. అంతేకాదు ఆయనపై ఓ కానిస్టేబుల్ ఇష్టానుసారంగా దాడి చేశారు. ఈ దాడిలో స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.
స్థానికుల ఆగ్రహం
మరోవైపు ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామిపై దాడి అన్యాయమంటూ మండిపడ్డారు. కానిస్టేబుల్ జగదీశ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వామికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. కొంతకాలంగా ఇంద్రకీలాద్రిపై అవుట్ పోస్టు పోలీసులు భక్తుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ప్రశ్నించిన వారిపై విచక్షణా రహితంగా దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు.






