- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. వివాహేతర సంబంధంపై గొడ్డలి వేటు..!
ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం పెద్దతండాలో దారుణం జరిగింది. చీమలపాడుకు చెందిన జమలయ్యపై సీతారాం అనే వ్యక్తి గొడ్డలితో తలపై బలంగా దాడి చేశారు....

X
దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా(Ntr District) ఎ.కొండూరు మండలం పెద్దతండా(Peddatanda)లో దారుణం జరిగింది. చీమలపాడుకు చెందిన జమలయ్యపై సీతారాం అనే వ్యక్తి గొడ్డలితో తలపై బలంగా దాడి చేశారు. ఈ ఘటనలో జమలయ్యకు తీవ్ర గాయం కాగా రక్తపు మడుగులో పడిపోయారు. స్థానికులు ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జలమయ్య పరిస్థితి పరిస్థితి విషమంగా ఉంది.
పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు
అయితే దాడి తర్వాత నిందితుడు సీతారాం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. దీంతో కేసు నమోుద చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తెలుసుకున్నారు. . పాత కక్షలు, కుటుంబ కలహాల కోణంలోనూ కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Next Story






