Ap New Governor అబ్దుల్ నజీర్‌కు ఘన స్వాగతం

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-02-22 15:01:38  IST  )

ఏపీ కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్రానికి వచ్చారు. గవర్నర్‌గా ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు...

Ap New Governor అబ్దుల్ నజీర్‌కు ఘన స్వాగతం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్రానికి వచ్చారు. గవర్నర్‌గా ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు అబ్దుల్ నజీర్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దీంతో ఆయనకు సీఎం జగన్ మోహన్ స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. కాగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఏపీకి కొత్త గవర్నర్‌గా రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. ఇందులో భాగంగా అబ్దుల్ నజీర్ రాష్ట్రంలో సేవలందించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గడ్ గవర్నర్‌గా నియామకయ్యారు.

Next Story