- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ లిక్కర్ కేసులో తెరపైకి వచ్చిన బాలం సుధీర్ ఇతనే !
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో ( Andhra Pradesh Liquor Scam) తెరపైకి కొత్త పేరు వచ్చిన సంగతి తెలిసిందే. బియాండ్ కాఫీ అధిన

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో ( Andhra Pradesh Liquor Scam) తెరపైకి కొత్త పేరు వచ్చిన సంగతి తెలిసిందే. బియాండ్ కాఫీ అధినేత బాలం సుధీర్ ( Balam Sudheer).. అనే కొత్త వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. ఇతను కూడా ఏపీ లిక్కర్ కేసులో భాగమైనట్లు చెబుతున్నారు. రాజ్ కసిరెడ్డికి (Kasi reddy ) అత్యంత సన్నిహితుడిగా... బాలం సుధీర్ ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది.
ఈ నేపథ్యంలోనే అసలు బాలం సుధీర్ ... ఎవరు? అతని వెనుక ఉన్నవారి బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? లిక్కర్ స్కాం లో ఎలా ఇరుక్కున్నాడు ? అనే విషయాలపై ఏపీ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో విజయ సాయిరెడ్డి ( Viajaysai Reddy), YCP పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి ( Peddi reddy) కుమారుడు మిథున్ రెడ్డిని ( Mithun Reddy) కూడా సిట్ అధికారులు విచారణ చేసిన సంగతి తెలిసిందే. వాళ్లను విచారించిన తర్వాత కీలక సమాచారాన్ని గ్రహించి... తాజాగా కొత్త పేరును తెరపైకి తీసుకువచ్చారు.
ఇక ఈ బాలం సుధీర్ అనే వ్యక్తి... కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడుగా కూడా గుర్తించారు. అతి త్వరలోనే బాలం సుధీర్ ను... స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయబోతున్నారట అధికారులు. ఇక అటు ఇప్పటికే... ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కసిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కసిరెడ్డిని సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు ప్రత్యేకంగా విచారణ కూడా చేస్తున్నారు. ఈ కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.






